బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు.. భయాందోళనలో గ్రామస్తులు

elephant

విజయనగరం జిల్లా ఏజెన్సీలో ఏనుగులు మళ్లీ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒడిషా ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చి గతం వారం శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో బీభత్సం స్ళష్టించిన 8 ఏనుగులు, వీరఘట్టం మండలం సరిహద్దు గ్రామమైన గోపాలపురం మీదుగా, విజయనగరం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లోకి ప్రవేశించాయి. జియ్యమ్మవలస మండలం గెడ్డసింగనాపురం, ఏనుగుల గూడ గ్రామాల శివారు ఏజెన్సీలోకి ప్రవేశించి తిష్ట వేసాయి. గత రెండు రోజులుగా కురుపాం ఫారెస్ట్ అధికారులు ఈ రెండు గ్రామాల ప్రజలను ఏనుగుల సంచారంపై అప్రమత్తం చేసారు. రాత్రి బయటకు రావడం, పొలాల్లోకి వెళ్లడం లాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులు ఈ ఏనుగుల గుంపును తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ 2 గ్రామాల ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. తమ గ్రామాలపైకి ఏనుగుల గుంపు రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తమ పంటలు నాశనం కాకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.