కారెక్కిన ఫైనల్ విజేతలు.. 24 గంటలు కారులో ఉండకపోతే..

రసవత్తరంగా మారుతోంది రాజకీయాలే కాదు బిగ్‌బాస్ హౌస్‌‌ కూడా. వంద రోజులు సందడి చేయడానికి వచ్చిన 16 మంది కంటెస్టెంట్లలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చివరకు 8 మంది మిగిలారు. షో చివరి దశకు చేరుకోవడంతో కష్టమైన టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్ హౌస్‌లోని వారికి. ఇందులో భాగంగానే నిన్న బజర్ మోగగానే ఎవరైతే 5గురు కారెక్కుతారో వారే ఫైనల్స్‌కు వెళతారని చెప్పడంతో అందరూ పోటీపడ్డారు.

కౌశల్‌ చివరి వరకు ఎలిమేనేషన్లో ఉండడం వలన అతడిని సంచాలకుడిగా నియమించారు బిగ్‌బాస్. ఇక రోల్ బజర్ కంటే ముందుగానే కారుదగ్గరకు చేరుకోవడంతో కారెక్కే ఛాన్స్ మిస్సయ్యాడు. కారు లోపల అమిత్, సామ్రాట్, తనీష్, గీత, దీప్తి, శ్యామల ఉన్నారు. కారులో 24 గంటలు ఎవరైతే ఉంటారో వారు నేరుగా ఫైనల్స్‌కు వెళతారు. కష్టమైనా కార్లోనే ఉంటారేమో. ఎందుకంటే ఫైనల్స్‌కు వెళ్లేది 24 గంటలు కార్లో ఉన్నవాళ్లు మాత్రమే అని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇవ్వడం కంటెస్టంట్లలో మరింత పోటీ తత్వాన్ని పెంచింది.