ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు బుర్ట్ రెనాల్డ్స్ (82) గురువారం ఫ్లోరిడాలో కన్నుమూశారు. వృధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న రెనాల్డ్స్ గత రాత్రి వచ్చిన గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారని మేనేజర్ ఎరిక్ క్రిట్జెర్ తెలిపారు.1970 లో బర్ట్ నటించిన లాంగెస్ట్ యార్డ్, బూగీ నైట్స్, స్మోకీ అండ్ ది బాండిట్‌ మూవీలు బాక్స్ ఆఫీస్ ముందు భారీ వసూళ్ళు రాబట్టింది.బర్ట్ రెనాల్డ్స్, డెలివరెన్స్, బూగీ నైట్స్‌ మూవీలలో నటించిన పాత్రలతో బుర్ట్ మంచి పేరు సంపాదించారు. బుర్ట్ రెనాల్డ్స్ ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను కూడా స్థాపించారు. హాలీవుడ్‌ ప్రముఖులు రెనాల్డ్స్ ఆకస్మిక మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.