టీఆర్‌ఎస్‌ అధినేత హోదాలో… ఇవాళ తొలిసారి..

kuthbhullapoor assembly seet give to vinodh by kcr

అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌… ఇవాళ తొలిసారి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అంతకంటే ముందే నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్‌ పూజలు నిర్వహించనున్నారు. కోనాయిపల్లికి వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న అనంతరం హుస్నాబాద్‌ వెళ్లి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.

కోనాయిపల్లిలోని వేంకటేశ్వరస్వామి అంటే కేసీఆర్‌కు ఎంతో నమ్మకం. 1983లో కేసీఆర్ మొదటిసారిగా ఆలయం దర్శించుకున్నారని.. అప్పుడు భారీ మెజారిటీతో గెలిచారని టీఆర్‌ఎస్‌ నాయకులు చెప్తున్నారు. అప్పట్నుంచి వెంకటేశ్వరుని ఆలయం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కోనాయిపల్లి ఆలయంలో పూజలు తప్పనిసరి. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే కేసీఆర్‌ నామినేషన్ వేస్తారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుండటంతో మరోసారి కోనాయిపల్లికి ప్రాధాన్యత ఏర్పడింది. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆపద్ధర్మ సీఎంకు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు.

ప్రతీ ఎన్నికకు ముందు కేసీఆర్ ఆలయానికి రావడం ఆనవాయితీ అంటున్నారు స్థానికులు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తమ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని చెబుతున్నారు. గ్రామాభివృద్దితో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటున్నారు కోనాయిపల్లి గ్రామస్తులు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -