ప్రేమించలేదని యువతి పరువు తీశాడు!

తన ప్రేమను ఒప్పుకోలేదనే కారణంతో యువతిపై అసభ్య ప్రచారానికి తెర తీసాడో యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. ఇటీవల ఆమె తోటి ఉద్యోగికి స్వాతిరెడ్డి పేరుతో పేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది. ఫ్రోపైల్‌‌లో ఉన్న ఫోటో తన సహోద్యోగిది కావడంతో ఆమె షాక్ తింది . ఫోటోతో పాటు ఓ అసభ్యకరమైన మెసేజ్ కూడా ఉంది. ఆ అమ్మాయితో గడపాలంటే రూ. 15 వేలు ఇస్తే చాలంటూ రాసి ఉంది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ఆ ఉద్యోగి వెంటనే మెసేజ్‌ని బాధిత యువతికి చూపించింది. పేస్‌బుక్‌లో ఈ వ్యవహారాన్ని గమనించిన బాధిత యువతి వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పేస్‌బుక్ యాజమాన్యానికి లేఖలు రాసి స్వాతిరెడ్డి ప్రొఫైల్ ఐపీ అడ్రస్సును కనుగొన్నారు. ఆమె మాజీ ఉద్యోగి మోహన్ కృష్ణ వర్మ ఈ ఐడి క్రియెట్ చేసి ఆమెపై అసభ్య ప్రచారం చేస్తున్నాడని విచారణలో తెలింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మోహన్ కృష్ణ వర్మ గతంలో యువతి పని చేసిన సంస్థలో పని చేశాడు. ఆ సమయంలో ఆమెతో ఏర్పడిన పరిచయంతో ప్రేమిస్తున్నట్లు ప్రతి పాదించాడు. దీనిని ఆ యువతి తిరస్కరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న మోహన్ స్వాతిరెడ్డి పేరుతో పేస్‌బుక్‌లో నకిలీ ఖాతాను తెరిచి అందులో యువతి ఫోటోను పెట్టి అసభ్య ప్రకటనలు పోస్టు చేశాడు.