ఓ సైకలాజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మూవీ ‘మసక్కలి’

కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే నా ఈ కథ అంటూ ఓ కుర్రాడి యాంగిల్‌లో చెప్పబోతోన్నసినిమా ‘మసక్కలి’. ఇప్పటి వరకూ చూడని విధంగా ఓ సైకలాజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. మిహిరామ్స్ సంగీతం అందించిన ‘మసక్కలి’ మూవీని వినాయకచవతి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరో సాయి రోనక్, హీరోయిన్ శ్రావ్య, శిరీష ల పాత్రలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

‘మసక్కలి’ ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. యూత్ పుల్ లవ్ లో కొత్త డైమన్షన్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు నబి యేనుగుబాల సక్సెస్ అయ్యారు. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో పాటు ఒక కొత్త పాయింట్ ని డిస్కస్ చేసాం. తప్పకుండా ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు నిర్మాత నమిత్ సింగ్.

‘‘నేను మీడియా రంగం నుంచి వచ్చినవాడినే. మసక్కలి సైకలాజికల్ గేమ్‌గా ఉంటుంది. అందమైన ప్రేమకథగా ఉంటూనే సైకలాజికల్‌గా ఓ కొత్త అనుభూతినిచ్చే కథనం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఓ న్యూఏజ్ లవ్ స్టోరీ. ‘మసక్కలి’ ఖచ్చితంగా మీ అందరికీ కొత్త అనుభూతినిస్తుందనే గ్యారెంటీ నాది’’ అన్నారు దర్శకుడు నబి యేనుగుబాల.