అధికారుల తీరుపై ఎంపి శివప్రసాద్‌ ఆగ్రహం

mp sivaprasad fire on thirupathi corporation officers

తిరుపతి కార్పొరేషన్‌ అధికారుల తీరుపై చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో కాపు,బిసి,జగజ్జీవన్‌రావు భవన్‌లకు ఆయన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. ఈకార్యక్రమాలకు శివప్రసాద్‌కు అధికారికంగా ఆహ్వానం అందలేదు. దీంతో.. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని మున్సిపల్‌ అధికారులపై మండిపడ్డారు. అధికారులు ప్రజాప్రతినిధులను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని.. అధికారిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం సమంజసం కాదని శివప్రసాద్‌ అన్నారు. ఈ విషయాన్నిముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని తెలిపారు. గతంలో కూడ ఓ అధికారిక కార్యక్రమానికి టీటీడీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మను ఆహ్వానించలేదు.తాజాగా.. ఈ ఘటనతో ఎంపి శివప్రసాద్‌కు తిరుపతి మున్సిపల్‌ అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. తాము అన్నివర్గాల ప్రజలకు కావలిసిన వాళ్లమని అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించకపోవడం అధికారుల అహంభావానికి అద్దం పడుతోందని శివప్రసాద్‌ మండిపడ్డారు.