మరో కొత్త వివాదానికి తెర తీసిన అర్జున్ రెడ్డి

అర్జున్‌రెడ్డి సినిమాతోనే సినిమాకి ఉన్న ఆ కొన్ని రూల్స్‌ని కూడా బ్రేక్ చేసాడు. పోస్టర్లతోనే వివాదాన్ని సృష్టించాడు. అదే ఆ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందేమో. సక్సెస్‌‌ఫుల్‌గా దూసుకెళ్లింది. ఆ తరువాత వచ్చిన గీతగోవిందం మరో పెద్ద సక్సెస్‌ని తెచ్చిపెట్టింది విజయ్ దేవరకొండకి.

ఇప్పుడు మరో సినిమా నోటా ట్రైలర్‌తో హల్ చల్ చేస్తున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా పోస్టర్‌పై కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తమిళ్‌లో, తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే తమిళ్‌లో పోస్టర్‌లు రిలీజ్ చేశారు అదే భాషలో. మరి మన తెలుగులోకి వచ్చేసరికి ఇంగ్లీషు భాషలో పోస్టర్లు ముద్రించారు.

అదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. తమిళ్‌లో చక్కగా వారి భాషలో ముద్రిస్తే మరి తెలుగులో ఎందుకు ఇంగ్లీషులో ముద్రించారంటూ నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. భాషాభిమానం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -