వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. వారు అక్కడికి వెళ్లొద్దు

rain-forecast-north-telangana-and-costa-andhra-said-visaka-weather-center

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో
ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులుకురిసే అవకాశం ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పైగా రానున్న నాలుగైదు రోజులు సముద్రంలో వేటకు వెళ్లరాదని తెలిపింది.