సిల్లీ ఫెలోస్ ఓ కామెడీ బకెట్.. థియేటర్ అంతా నవ్వులే నవ్వులు: మూవీ రివ్యూ

కామెడీ కి కేరాఫ్ గా మారిన అల్లరి నరేష్, సునీల్ కలసి సిల్లీ ఫెలోస్ పై ఆసక్తిని పెంచారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈమూవీ నవ్వులు గ్యారెంటీ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సిల్లీ ఫెలోస్ ఎంతగా నవ్వించారో
చూద్దాం..

కథ:
వీరబాబు( నరేష్) టైలర్ గా వర్క్ చేసుకుంటూ తమ ఎమ్యల్యే జాకెట్ జానకిరామ్(జయ ప్రకాష్) కి అనుచరుడిగా ఉంటాడు. మంత్రి ముందు బిల్డప్ లు ఇవ్వడానికి కొన్ని జంటలకు పెళ్ళి చేసే కార్యక్రమం చేపడతాడు జానకి రామ్ . ఆ కార్యక్రమంలో జంటలను సెట్ చేసే పని వీరబాబుకు అప్పగిస్తాడు జానికి రామ్. అలా ఒక దొంగ పెళ్ళి చేసుకుంటాడు వీరబాబు ప్రెండ్ సూరిబాబు(సునీల్). అతను పెళ్ళి చేసుకున్నది రికార్డింగ్ డాన్స్ లు వేసే పుష్ప( నందినిరాయ్) ని. ఆ పెళ్ళి ఫోటోలు పేపర్లో పడి సూరిబాబు పెళ్ళి ఆగిపోతుంది. వీరబాబు ప్రేమించిన అమ్మయి వాసంతి (చిత్రశుక్ల) పోలీస్ కావాలని ప్రయత్నిస్తుంది. అందుకు ఎమ్యల్యే జానకిరామ్ కి సాయం చేయమని వీరబాబు ద్వారా పది లక్షలు అందిస్తుంది వాసంతి అమ్మ. కానీ యాక్సిడెంట్ జరిగి జానకిరామ్ కోమాలోకి వెళతాడు. పుష్పనుండి సూరి బాబు బయటపడాలన్నా జానకి రామ్
బయటికి రావాలి. జానకిరామ్ ని చంపాలని ప్రత్యర్ధులు. ట్రై చేస్తుంటారు. మరి వీరబాబు, సూరిబాబు తమ సమస్యలనుండి బయటపడతారా..? జానకిరామ్ కోమాలోంచి బయటకి వచ్చాడా లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:
అల్లరి నరేష్ లోని అల్లరి మళ్ళీ గుర్తు చేసిన సినిమా సిల్లీ ఫెలోస్. ఈ సినిమాలో నరేష్ కామెడీ టైమింగ్ బాగా నవ్వించింది. ఇక సునీల్ హీరో ఇమేజ్ లను పట్టించుకోకుండా క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేసాడు. పుష్ప క్యారెక్టర్ తో అతను ఇరుక్కున్నాక సునీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చాలా నవ్వించాయి. ఇక ఈ సినిమాలో హీరోలతో పాటు పోటీ పడి నవ్వించింది జయప్రకాష్. సెకండాఫ్ లో అతని క్యారెక్టర్ లోని వేరియేషన్స్ తో పాటు ఏం అడిగినా మొదటి నుండి చెప్పే అతని అలవాటు సృష్టించిన కామెడీ పొట్ట చెక్కలు చేసింది. ఆ సీన్ లో పోసాని కృష్ణ మురళి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇంకా బాగా నవ్వించాయి. పుల్ లెంగ్త్ కామెడీ చేయడానికి డిసైడ్ అయి చేసిన ఈ రీమేక్ మూవీ నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. నరేష్, సునీల్ నుండి ఆశించే కామెడీని అందించడంలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు విజయం సాధించాడు. చిత్రశుక్ల, నందిని రాయ్‌లు తమ పాత్రలు ను కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేసి గ్లామర్ ని యాడ్ చేసారు. సినిమా అంతా నవ్వుల మయం కాబట్టి కాస్త లాజిక్స్ ని పట్టించుకోకుండా నవ్వడానికి డిసైడ్ అయితే ఈ సిల్లీ ఫెలోస్ ని బాగా ఏంజాయ్ చేయోచ్చు. భీమినేని ఒరిజినల్ సినిమా లోని ఫన్ ని రీ జనరేట్ చేయగలిగాడు. క్లైమాక్స్ ని మాత్రం కాస్త ఛేంజ్ చేసాడు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి సిల్లీ ఫెలోస్ పనికి వస్తారు.

చివరిగా:
సిల్లీ ఫెలోస్ నవ్వించారు.