ఢిల్లీలో ఉగ్రవాదుల కలకలం.. ఇద్దరు అరెస్టు

2-terrorists-of-islamic-state-arrested-by-delhi-police-near-red-fort

ఢిల్లీలో ఉగ్ర కలకలం రేగింది. ఐసిస్‌తో సంబంధాలున్న ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట సమీపంలోని బస్టాండ్‌‌ దగ్గర అనుమానాస్పద రీతిలో తిరుగుతుండటంతో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇద్దరు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాకు చెందిన పర్వేజ్‌, జంషెద్‌గా గుర్తించారు. వీరిని జమ్ముకశ్మీర్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా సభ్యులుగా తేల్చారు. ముష్కరుల నుంచి అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన పర్వేజ్‌ సోదరుడు కూడా ఉగ్రవాదే. ఈ ఏడాది జనవరిలో షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పర్వేజ్‌ సోదరుడు మృతి చెందాడు. ప్రస్తుతం ఎంటెక్‌ చదువుతున్న పర్వేజ్‌.. సోదరుడి మృతితో ఉగ్రవాద బృందంలో చేరినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు ఢిల్లీని కేవలం రవాణా ప్రాంతంగా మాత్రమే వినియోగించుకున్నారని పోలీసులు నిర్ధారించారు. వీరి దగ్గర దాడులు ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -