నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చేపట్టిన అపరేషన్‌ గరుడ మరో రూపం దాల్చి.. ఆంధ్రప్రదేశ్‌పై దాడికి సిద్ధమైందన్నారు. ఏపీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంబించిందని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా చంద్రబాబుకు సోమవారం నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిందన్నారు. ముఖ్యమంత్రిని టార్గెట్‌గా చేసుకుని ఒక రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే దుర్మార్గానికి బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ నేతలు పొలిటికల్‌ టెర్రరిస్టులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హోదా గురించి ఎవరు అడిగినా గిట్టనివాళ్లుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.