పెళ్ళింట విషాదం…ఒకేరోజు తండ్రీకొడుకులు…

శుభకార్యం జరిగిన నాలుగురోజులకే పెళ్ళింట విషాదం చోటుచేసుకుంది. పెళ్ళి కొడుకుతో పాటు అతని తండ్రి మరణించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. నిజామాబాద్‌లో ఆటో నడుపుతూ జీవించే అబ్దుల్ గఫార్(24) కు నాలుగు రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్ళి అనంతరం కుటుంబ సభ్యులు గురువారం మహారాష్ట్రలోని కందార్ దర్గాకు వెళ్లారు. అనంతరం దర్గా పక్కన ఉన్న చెరువలలో సాన్నం చేయడానికి వెళ్ళారు. ఒక్కసారిగా ఉన్నట్టుండి గఫార్ నీటిలో మునిగిపోయాడు.ఇది గమనించిన తండ్రి సత్తార్‌ కొడుకుని కాపాడేందుకు నీటిలోకి దిగాడు. అతన్ని కాపాడే క్రమంలో ఇద్దరూ నీటమునిగి గల్లంతయ్యారు. దీంతో స్థానికులు చెరువులో గాలించి వారి మృతదేహాలను బయటకు తీశారు. తండ్రీకొడుకులు ఒకేరోజు మరణించడంతో కుంటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.