హ్యాక్‌‌కు గురైన 3.8 లక్షల క్రెడిట్‌కార్డులు

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో క్రెడిట్ కార్డు ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వారి వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దాదాపు 3.8 లక్షల మంది ప్రయాణికుల క్రెడిట్‌ కార్డు వివరాలను హ్యాకర్స్ చోరీ చేసారని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ధృవీకరించింది. ప్రయాణీకుల వివరాలు దుర్వినియోగం అవడంపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అలెక్స్‌ క్రూజ్‌ బ్రిటీష్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. ప్రయాణీకుడి పేరు, చిరునామా, ఈ–మెయిల్‌ అడ్రస్, క్రెడిట్‌ కార్డు సమాచారాన్ని (కార్డు నెంబరు, ఎక్స్పైరీ డేట్, సీవీసీ కోడ్‌) హ్యాకర్లు సంపాదించారు ప్రయాణీకుల డేటా దుర్వినియోగం అవడంతో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌పై ప్రయాణీకులు సహా ఐటీ నిపుణులు మండిపడుతున్నారు.