ఆ ఎమ్మెల్యేల వివరాలివ్వండి : సీఎం చంద్రబాబునాయుడు

cm chandrababunaidu fire on obsent mla's in assembly

అసెంబ్లీ సమావేశాలకు రెండో రోజు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల హాజ‌రు తక్కువగానే కనిపించింది. దీంతో ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి హాజ‌రు కావ‌డం లేదంటూ ఫైరయ్యారు. ఏ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజ‌రు అవుతున్నారు, ఎవరు డుమ్మా కొడుతున్నారో ఎప్పటికప్పుడు వివరాలను త‌న‌కు అందించాల‌ని శాస‌న‌స‌భ, శాస‌నమండ‌లి విప్‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏ ఎమ్మెల్యే ఎంతసేపు స‌భ‌లో ఉంటున్నారు.. ఏ ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై మంత్రుల‌కు ప్రశ్నలు సంధిస్తున్నారో కూడా త‌న‌కు చెప్పాల్సిందిగా విప్‌లకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ప్రతిపక్షం అసెంబ్లీకి డుమ్మా కొట్టింద‌ని మ‌నం అంటూనే సొంత‌పార్టీ ఎమ్మెల్యేలు హాజ‌రు కాక‌పోతే ఇకపై స‌హించేదిలేద‌ని చంద్రబాబు హెచ్చరించారు.