నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తిన డాక్టర్

ఓ డాక్టర్ నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి..రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో తనకు న్యాయం చేమయంటూ పోలీసులను ఆశ్రయించిందా బాధితురాలు. పోలీసులు స్పందించకపోవటంతో ఆమె అదే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే..స్థానికులు, పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందు చోటు చేసుకుంది ఈ ఘటన.

తిరుమతికి చెందిన కుమారికి, డాక్టర్ ఆదర్శ్ రెడ్డితో వివాహం అయ్యింది. అయితే..అప్పటికే పెళ్లైన విషయాన్ని గోప్యం ఉంచిన ఆదర్శ్ రెడ్డి కుటుంబ సభ్యులు..కొన్నాళ్ల తర్వాత కుమారిని వేధించటం ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఆదర్శ్ రెడ్డి మూడో పెళ్లికి సిద్ధం కావటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో..కుమారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అడ్డుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.