రేపటినుంచి హైదరాబాద్ కు ఈవీఎంలు

EVM's coming by tommarow in hyderabad

రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు, మౌలిక వసతులను బేరీజు వేసుకున్నాకే ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేస్తామని… సీఈసీ ఓపీ రావత్‌ తెలిపారు. వాస్తవానికి మార్చి వరకు ఎలక్షన్స్‌కు సమయం ఉన్నా.. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగరాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ప్రక్రియను వీలైనంత త్వరగానే ప్రారంభించేందుకు చూస్తామన్నారు. కాగా.. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్‌ ప్రకటనను రావత్‌ తప్పుబట్టారు. సీఈసీని సంప్రదించకుండా.. రాజకీయ నాయకులు తేదీలు ప్రకటించడం మంచి సంస్కృతి కాదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. రేపటి నుంచి హైదరాబాద్‌కు ఈవీఎంలు తరలిరానున్నాయి. ఈవీఎం, వీవీ పాట్స్‌ కోసం ఈసీ ఇప్పటికే భెల్‌కు లేఖ రాసింది.