ఇండిగో బంపరాఫర్.. రూ.3,330కే చలో ఢిల్లీ..

ఎయిర్ ఇండియా సంస్థ ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో విమాన ప్రయాణం చేయాలన్న తమ కోరికను విరమించుకున్నారు చాలా మంది ప్రయాణీకులు. అయితే ఇండిగో ఇచ్చిన ఆఫర్లు ప్రయాణీకులను ఊరిస్తున్నాయి. ఢిల్లీకి టికెట్ ధర రూ.3,330గా నిర్ణయించింది. ఇండిగో వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్‌ చేసుకునే ప్రయాణీకులకు ఈ అవకాశం కల్పించింది. ఈ ఆఫర్‌తో ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకుంటే తక్కువ ధరకే ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

సాధారణంగా ముందుగా బుక్ చేసుకుంటే సగటు ధర రూ.6,000 ఆ పైన ఉంటుంది. బుకింగ్ కల్పించిన మొదటి వారం తరువాత రూ.3,330, మధ్యలో రూ.2,220కు టిక్కెట్ లభించే అవకాశాన్ని కల్పించింది. తొలి విమాన సర్వీసును అక్టోబర్ 1వ తేదీన నడపాలని ఇండిగో ముహూర్తం నిర్ణయించింది. తెల్లవారుజామున విమానం ఎక్కితే ఉదయం 9 నుంచి 10 మధ్యలో ఢిల్లీకి చేరుకోవచ్చు.