బంపర్ ఆఫర్.. రూపాయికే స్మార్ట్‌ఫోన్..

చైనా కంపెనీ ‘ఆనర్’ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరుతో కేవలం రూ.1కే 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ గల ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందించనుంది. ఆనర్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ఫ్లాష్ సేల్ పేరుతో ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందించనుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 11,999గా ఉన్న ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌‌ను రూ.1 పొందాలంటే ఆనర్ ఆన్‌లైన్ స్టోర్లలో రిజిస్టేషన్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. ఆనర్ ఎన్9‌తో పాటు ఆనర్ 7ఎస్, మరికొన్ని ఫోన్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.45 నిమిషాలకు ఫ్లాష్ సేల్ ఆఫర్ ప్రారంభం అవుతుందని ఆనర్ కంపెనీ స్పష్టం చేసింది.