విమర్శలకు బాధపడుతున్న జాన్వీకి కరణ్ జోహార్ సలహా..

అమ్మ అందాన్ని పుణికి పుచ్చుకున్న జాన్వీ అదే ప్లస్ పాయింట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టింది. వచ్చిన మొదటి సినిమా ధడక్‌తో మంచి ఎంట్రీ ఇచ్చింది. విమర్శకుల ప్రశంసలను చూరగొంది. ఇండస్ట్రీలో ఉన్న వారిపై విమర్శలకు కొదవుండదు. అందుకు జాన్వీ కూడా మినహాయింపు కాదంటూ వస్తున్న రూమర్స్‌ని ఎలా తట్టుకోవాలని వాపోతోంది. ఇదే విషయాన్ని తన కెరీర్ బాధ్యతల్ని తీసుకున్న దర్శకుడు కరణ్‌జోహార్‌ దగ్గర ప్రస్తావించింది.

ఇలాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోవాల్సిన పనిలేదంటూ సలహా ఇచ్చారు. ఖాళీగా ఉన్నారేమో..అందుకే ఏపనీ లేక విమర్శలు చేస్తుంటారు. అయినా వాటిని కూడా తేలిగ్గా తీసుకోవడం నేర్చుకుంటేనే కెరీర్‌లో ముందుకెళ్ళగలుగుతావు. విమర్శలు చేసేవారు తాము ఆనందంగా ఉండరు. ఇతరులు ఆనందంగా ఉంటే చూడలేరు. ఇవేవీ పట్టించుకోవద్దు. నువ్వు ఇంత అందంగా, ఆనందంగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అంటూ జాన్వీని ఊరడించారు.