అతడి గెలుపు కోసం 2కె రన్.. విజయం వరించేనా..

టీమ్‌లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు. కానీ చిత్రంగా చాలా మందికి అతడు నచ్చాడు. దానిక్కారణం అతడి ముక్కుసూటి మనస్తత్వమే అని చెబుతున్నారు. అతడిని అభిమానించడమే కాదు ఆయన కోసం కౌశల్ ఆర్మీ అని ఓ టీమ్‌ని కూడా తయారు చేశారు. ఛానెల్‌లో వస్తున్న బిగ్‌బాస్‌2 చప్పగా మొదలై ఘాటుగా సాగుతోంది. మరో పది రోజుల్లో ముగియనున్న షో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది బుల్లి తెర ప్రేక్షకుల్లో. షో ముగింపుదశకు చేరుకోవడంతో క్లిష్టమైన టాస్క్‌లను
ఇస్తున్నాడు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకి.

షో ఎంత ఆసక్తికరంగా సాగుతోందో బయటకూడా కౌశల్ ఆర్మీ అంతే సందడి చేస్తోంది. అతడి పేరు మీద ఆర్మీ క్రియేట్ అవడమే కాకుండా 2కే రన్ కూడా నిర్వహిస్తోంది కౌశల్ ఆర్మీ. ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడమే కాకుండా నెటిజెన్స్‌నుంచి భారీ ఎత్తున మద్దతు కూడా కూడగట్టుకున్నారు. 2కే రన్‌ను సెప్టెంబర్ 10 ఆదివారం రోజున మాదాపూర్‌లో నిర్వహించనున్నట్లు కౌశల్ ఆర్మీ సభ్యులు తెలియజేసారు. మరి ఈ రన్‌కు ప్రేక్షకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.