టీడీపీ లేకుండా.. ఏ పార్టీ అధికారంలోకి రాదు- ఎల్‌. రమణ

తెలంగాణలో టీడీపీ లేకుండా ఏ పార్టీ అధికారంలో రాబోదని .. టీటీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు కలిసి వచ్చే అన్ని పార్టీలతో పొత్తులకు సిద్దమని ప్రకటించారు. ఆ దిశగా కార్యాచరణ చేపడుతామని, కేసీఆర్‌కు టీడీపీ సత్తా చూపిస్తామని చెప్పారు.