సొంత గూటికి కొండా సురేఖ?

konda surekha may join in congress

తెలంగాణలో పార్టీలతోపాటు నేతలు కూడా తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు.. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే తమ దారి వెతుక్కుంటున్నారు.. వలసలు జోరందుకున్నాయి.. మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేస్తే.. టీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకుని ఉన్న కొండా సురేఖ దంపతులు మళ్లీ సొంత ఇంటికి వెళ్లబోతున్నారు.. ఈరోజు టీఆర్‌ఎస్‌ పార్టీకి కొండా దంపతులు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆజాద్‌ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారాం జరుగుతోంది..

కొండా సురేఖ పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు వరంగల్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. తన పేరును మాత్రం వెల్లడించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా కాలంగా పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లు ఉంటున్న సురేఖ.. మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మీడియా ముందుకు రానున్న కొండా దంపతులు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -