పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్‌ ప్రీతీ జింగానియా

ప్రముఖ నటీ ప్రీతీ జింగానియా పోలీసులను ఆశ్రయించారు. ప్రీతీ తన భర్తతో కలిసి ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. అపార్ట్‌మెంట్‌లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య చిన్న గొడువ తలెత్తింది. దీంతో తన ఏడేళ్ళ కొడుకుపై ఓ వృద్దుడు చేయి చేసుకొవడంతో పాటు అపార్టమెంట్ నుంచి కిందకు గెంటవేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరు కుంటుంబాలకు సయోద్య కుదిర్చి పంపించినట్టుగా తెలుస్తోంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్‌ ప్రీతీ జంగానియా తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు