పర్యాటకం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

rave party busted in rampachodavaram

తూర్పుగోదావరి జిల్లాలో రేవ్‌పార్టీ కలకలం రేపింది. రంపచోడవరం మండలం దేవరాతిగూడెంలో Aవన్‌ రిసార్ట్‌లో రేవ్‌ పార్టీ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు తెరతీశారు. రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 8మంది యువతులతోపాటు 27 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్‌పార్టీ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

పర్యాటకం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. రిసార్ట్ యాజమాన్యమే రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నాయి. నగరాలకే పరిమితమైన చెత్త సంస్కృతి.. అమాయక ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేవరాతి గూడెంలోని Aవన్‌ రిసార్ట్‌ యజమాని రమణ మహర్షి అలియాస్ బాబ్జీపై కేసు నమోదు చేశారు. ఎన్నాళ్ల నుంచి రేవ్ తంతు జరుగుతోందనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.