చిరిగిన నోట్లు మార్చుకునే నిబంధనల్లో సవరణ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా చిరిగిన నోట్ల మార్చుకునే విధానంలో కొత్త నింబంధనలు అమల్లోకి తీసుకవచ్చింది. నోట్‌ రిఫండ్‌ చేసుకొనే విధానంలో 2009లో సవరణలు చేసినట్టు ఆర్‌బిఐ శుక్రవారం పేర్కొంది. తక్షణమే ఆ నిబంధనలు, అమల్లోకి వస్తాయని తెలిపింది. ముక్కలైన పాడయిపోయిన నోట్లను డిజిగ్నేటెడ్‌ బ్యాంకు శాఖల్లోగాని, స్థానిక ఆర్‌బిఐ కార్యాలయాల్లోగాని మార్చుకోవచ్చు. నోట్ల స్థితిని టట్టి విలువను చెల్లిస్తారు. కొత్త సిరీస్‌ నోటు మార్పిడిలో విలువను చెల్లించే విధానంలో నిబంధనలను మార్చినట్లు ఆర్‌బిఐ తెలిపింది.