సచిన్ భావోద్వేగపు ట్వీట్.. వైరల్

క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా తన గారాల పట్టి గురించి ఓ భావోద్వేగపు ట్వీట్ చేశాడు. ముంబై ధీరుభాయ్‌ అంబాని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన సారా లండన్‌ యూనివర్సిటీ కళాశాలలో మెడిసన్‌ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సచిన్ భార్య అంజలితో సారా స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. సారా టెండూల్కర్ లండన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా అందుకున్న తరుణంలో సచిన్ ట్విటర్‌లో తన అనుభూతిని పంచుకున్నాడు. ‘నిన్నమొన్ననే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు మాకు గర్వంగా ఉంది. వెళ్లు.. ప్రపంచాన్ని జయించు’ అని ట్వీట్‌ చేశాడు సచిన్. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.