అలా మారి ఇలా చేసేదాన్ని : సంచలన విషయం చెప్పిన అభిరామి

smartphone-addict-woman-video-calls-boyfriend

ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన పిల్లల్ని అంతమొందించిన అభిరామి పోలీసులకు మరో సంచలన విషయం చెప్పింది. వివాహేతర సంబంధానికి అడ్డురావడంతో సైకోగా మారానని చాలా సార్లు పిల్లల్ని తీవ్రంగా కొట్టినట్టు వారికీ చెప్పింది. అంతేకాదు ఎప్పుడు తన ప్రియుడు ఇంటికి వచ్చినా పిల్లలు అతన్ని పొమ్మనేవారు.. ఆ సమయంలో వారిపట్ల కర్కశంగా వ్యవహరించానని వెల్లడించింది. పిల్లలు ఇంట్లో ఉన్న సమయాల్లో సెల్‌ఫోన్‌కు బానిస అయిన అభిరామి తన ప్రియుడితో గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేదాన్ని.. ఆ సమయంలో పిల్లలు తండ్రికి చెబుతారేమోనన్న భయంతో ఉంటానని అభిరామి చెప్పింది. చివరకు తన సరదాలకు అడ్డుగా ఉన్నారన్న కారణంగా సైకోగా మారి కన్న కొడుకు, కూతురిని విషం కలిపి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకుంది.