విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పాము కలకలం

విజయవాడ దుర్గ గుళ్లో పాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అమ్మవారి దర్శనం కోసం అంతరాలయంలోకి వచ్చిన భక్తులు.. పామును చూసి కేకలు పెట్టారు. దీంతో అది ఫ్లోరింగ్‌ కింద ఉన్న రంధ్రంలోకి దూరింది. దాన్ని పట్టుకునేందుకు సిబ్బంది… ఫ్లోరింగ్ తవ్వుతున్నారు.

దుర్గ గుళ్లోకి పాము రావడం ఇది నాలుగోసారి కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ప్రాణ హాని జరగకుండా పామును బయటకు పంపేందుకు సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.