నేను అలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. : దర్శకుడు మారుతి

-కుమార్ శ్రీరామనేని

చైతన్య ని చూస్తుంటే నాగ్ సార్ గుర్తుకు వచ్చారు:

యాక్టర్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది. ఆర్టిస్ట్ గా నాగచైతన్య కొన్ని సీన్స్ లో సర్ ప్రైజ్ చేసాడు. వాళ్ల నాన్న గారిని చూస్తున్నట్లు అనిపించేది. చాలా యాక్టివ్ గా చేసాడు. నేను రాసిన దానికి మించి చేసాడు.

అత్తా అల్లుడి మద్య రోటీన్ సీన్స్ ఉండవు:
అత్తను అల్లుడిని ఛాలెంజ్ చేయడం.. ఆమెను మార్చడం లాంటి సినిమా కాదు. ఇది కంప్లీట్ గా ఢిపరెంట్ గా ఉంది. నార్మల్ పర్సన్ శైలజా రెడ్డి కి అల్లుడు ఎలా అయ్యాడు అనది కథ.

ఇద్దరితో ప్రాబ్లమ్ ఉంటుంది:
ఇద్దరి ఇగోస్టియిక్ పర్సన్ మద్య నలిగే పాత్ర హీరోది. అలా అని ఇగో అనే క్యారెక్టరైజషన్ మీద వెళ్ళదు. ఇంట్లో ఫాదర్ కి ఇగో ఉంటుంది. నాగ చైతన్యకి బాగా ఫిట్ అయ్యే క్యారెక్టర్ ఇది. నాగచైతన్య కు ఓపిక ఎక్కువ. ఈ పాత్రకూడా అలాగే ఉంటుంది.

ఈ అత్త చెడ్డది కాదు:
అసలు అత్త అనగానే మనకి ఒక ఇంప్రెషన్ ఉంది. అది శైలజా రెడ్డి అల్లుడు లో ఉండదు. శైలజా రెడ్డి ని విలన్ గా చూపించలేదు. ఆమె క్యారెక్టర్ లో ఇగో ఉంటుంది. ఇందులో టైటిల్ ఒక్కటే పాతది. కథ, కథనం కొత్తగా ఉంటాయి. టైటిల్ బట్టి కథ ఊహించిన వారు సినిమాకి వచ్చిన తర్వాత కొత్తగా ఫీల్ అవుతారు.

శైలజారెడ్డి అనడం వెనుక:
రమ్యకృష్ణ గారిని టైటిల్ లోకి తీసుకురావడం ఇంపాక్ట్ కలిగిస్తుంది అనుకున్నాం. నాగచైతన్య హీరోయిక్ ఇమేజ్ ని కోరుకోడు. రెడ్డి అంటే కొంత పవర్ పుల్ నెస్ యాడ్ అవుతుందని పెట్టాం. సినిమా అంతా క్లాస్ గా ఉంటుంది.

అను ఇమ్మానియేల్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ని చేసింది:
ఆమె బయట ఎలా ఉంటుందో సినిమాలో అలాగే ఉంటుంది. సినిమా కాబట్టి కొంత డోస్ పెంచాము. ఆమె ఏ పరిస్థితుల్లోనూ కిందకు దిగదు. అందుకే క్యారెక్టర్ ని జస్ట్ బిహేవ్ చేసింది.

ఇది నాకు చాలా ప్రత్యేకం:
నేను యూత్ ఫుల్ మూవీస్ చేసాను. హార్రర్ లో కామెడీ చేసాడు. డిజార్డర్స్ బేస్ చేసుకొని చేసాను. కానీ ఇది పూర్తి ప్యామిలీ సినిమా. సెకండాఫ్ చాలా కలర్ పుల్ గా ఉంటుంది. అందుకే చాలా ప్రత్యేకంగా అనిపించింది.

వెన్నెల కిషోర్ చేసే ఫన్ విచిత్రంగా ఉంటుంది:
అతని ప్రతిదీ పోలిక తో చెబుతాడు. డైరెక్ట్ గా చెప్పడు హీరో తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అతనిది. ప్రాణిక్ హీలింగ్ డాక్టర్ గా అతని ట్రాక్ బాగుంది.

సితార ఎంటర్ టైన్మెంట్స్ చాలా కంఫర్ట్:
నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏది కావాలంటే అది ఇచ్చారు. నేను చేసిన సినిమాల్లో ఇదే రిచ్ గా ఉంది. ఎప్పుడూ సినిమా బాగుండాలి అని మాత్రమే చెబుతారు. నాగవంశీ, చినబాబు గారు సినిమా చూసారు. వారు అంతా పుల్ హ్యాపీ.

కేరళ లో పరిస్థితి చూసి గోపీసుందర్ ని తొందర పెట్టలేదు:
కేరళ కి వెళ్లగానే వరదలు స్టార్ట్ అయ్యాయి. గోపీసుందర్ రిలేటివిస్ వరదల్లో చిక్కుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని రిలీజ్ డేట్ అని ఇబ్బంది పెట్టకూడదని . రిలీజ్ తర్వాత ప్లాన్ చేసుకున్నాం.

ఫ్యామిలీ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అవడానికి ఈ సినిమా చేసారా..?

నేను కొత్తగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం లేదు. భలే భలే మోగాడివోయ్ తీసినప్పుడే ఫ్యామిలీస్ కి దగ్గరయ్యాను. ఇప్పడు ఆ అవసరం లేదు. డైరెక్టర్ గా నేను ఎప్పుడూ కొత్త జానర్స్ ని ట్రై చేయాడానకి ఇష్టపడతాను.

డిజార్డర్ కి బ్రేక్ ఇచ్చాను:

ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చాను.. కానీ నాకు డిజార్డర్స్ చాలా ఇష్టం. కొంత బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీస్తా. చిన్న సినిమాలకు కథలు అందించడం ప్రస్తుతానికి ఆపేసాను. నాకు నమ్మకం ఉంటే తప్ప చేయకూడదు అని నిర్ణయించుకున్నాను.

నేటివిటీ బ్రాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తాను:

నాకు 80, 90 దశకాల్లో రోజులు అంటే చాలా ఇష్టం. సినిమా చూడాలంటే అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు కనపడదు. యండమూరి నవలల కోసం పరుగులు పెట్టే రోజలు..అప్పుడున్న ప్రేమలు చాలా ప్యూర్ గా ఉండేవి. ప్రతి చిన్న విషయానికి ఎంతో ఇంపార్టెంట్ ఇచ్చిన రోజులు అంటే ఇష్టం . ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమాలో చేయాలని ఉంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.