చిరుతను చూసి భయంతో శునకం చేసిన పని.. చివరకు.. వీడియో వైరల్

అవకాశం వచ్చినప్పుడే నువ్వేంటో నిరూపించుకోవాలి. అనుకోని అవాంతరాలు ఎదురైతే పిరికితనంతో పారిపోకూడదు. సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు వెళ్లాలి. మనుషులకే కాదు జంతువులక్కూడా వర్తిస్తాయేమో ఈ వ్యాఖ్యలు. ఇక్కడ ఒక శునకాన్ని చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. రాజస్థాన్‌లోని ఝలానా రిజర్వ్‌ ఫారెస్ట్‌‌లో చిరుతల సఫారీ పార్క్ ఉంది. దీంతో చిరుతలను దగ్గర్నుంచి చూడాలని పర్యాటకులు జిప్సీల్లో వెళుతుంటారు.

అలా వెళుతున్న ఓ ప్రయాణికుడి కంట పడింది ఈ దృశ్యం. దాన్ని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. చిరుతలను చూడ్డంకోసం ఫారెస్ట్‌లో ఓ దగ్గర జిప్సీని ఆపారు. దానికి ఎదురుగా శునకం పడుకుని ఉంది. అంతలో పొదల మాటునుంచి చిరుత వచ్చింది. దాన్ని చూసిన శునకం మొదట భయపడ్డా ఆ తరువాత ఏ మాత్రం భయాన్ని కనిపించనివ్వకుండా ఆత్మరక్షణ కోసం అరవడం మొదలు పెట్టింది.

అసలు చిరుత ముందు తనెంత అని అనుకోలేదు. సాయశక్తులా ప్రయత్నించింది. వచ్చిన చిరుత తోక ముడుచుకుని వెళ్లే వరకు అరుస్తూనే ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన పర్యాటకులు ఈ రోజు చిరుత చేతిలో శునకం ప్రాణాలు పోవడం గ్యారంటీ అనుకున్నారు. కానీ శునకం ధైర్యంగా ఎదిరించడాన్ని చూసిన పర్యాటకులు శునకం ప్రదర్శించిన ధైర్యానికి విస్తుపోయారు. ఆ శునకాన్ని తమతో పాటు తీసుకువచ్చి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వదిలిపెట్టారు.