హీరోగా ధర్మవరపు సుబ్రమణ్యం మేనల్లుడు

dharmavarapu-subramanyam

‘ధర్మవరపు సుబ్రమణ్యం’ ఈ పేరంటే ముందుగా గుర్తుకు వచ్చేది కడుపుబ్బా నవ్వించే కామెడీ.. తన సున్నితమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగొందారు. దురదృష్టవశాత్తు క్యాన్సర్ కారణంగా 2013 లో మరణించారు. ఇదిలావుంటే ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో అయన మేనల్లుడు హీరోగా అరంగేట్రం చేస్తున్నట్టు ఆ వార్త సారాంశం. ఒక ప్రముఖ నిర్మాణసంస్థ నుంచి ఆ చిత్రం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుందని.. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఫిలింనగర్ సమాచారం.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.