దివాకర్‌రెడ్డి Vs ప్రభాకర్ చౌదరి: సహనం పరీక్షించాలని చూస్తే సహించేది లేదు

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య మళ్లీ మాటల తూటాలు పేలాయి. ప్రభుత్వం నిధులిస్తున్నా MLA వాటిని అడ్డుకుంటున్నారని JC ఆరోపించారు. అభివృద్ధికి స్థానిక దుష్టశక్తులు అడ్డుతగులుతున్నాయన్నారు. దీనికి ప్రభాకర్ చౌదరి కౌంటర్ ఇచ్చారు. వయసు పెరుగుతున్నా సంస్కారం లేకుడా JC మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా తన సహనం పరీక్షించాలని చూస్తే సహించేది లేదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.