డీఎంకే నేతలతో స్టాలిన్ కీలక సమావేశం

ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల నియంతృత్వాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కాషాయీకరణ కలలను కల్లలు చేస్తామని హెచ్చరించారు. చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో… పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులతో స్టాలిన్ కీలక సమావేశం నిర్వహించారు.

తమిళనాడు ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్టాలిన్ ఆరోపించారు. మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మానవ హక్కుల కార్యకర్తలను, బీజేపీని వ్యతిరేకించేవారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తోందన్నారు. దళితులు, మైనారిటీలపై చాలాచోట్ల దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలవుతోందన్నారు. ఎన్నికల నియంతృత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసిందని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తోందని స్టాలిన్‌ నిప్పులు చెరిగారు.