పెళ్లయిన 24 రోజులకే…

పెళ్ళి జరిగిన 25 రోజులకే వవరుడు మృత్యువాత పడిన సంఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. కుసుమూరు గ్రామానికి చెందిన మజ్జి సూర్యనారాయణ (23)కు పి.జ్యోతితో గత నెల 16న వివాహం జరిగింది.సూర్యనారయణ తన భార్యతో కలిసి శుక్రవారం అత్తవారింటికి వచ్చాడు. కాలక్షేపం కోసం అత్తవారి పొలంలో వద్దుకు వెళ్లాడు. బావి దగ్గర నుంచి తిరిగి వస్తున్న సమయంలో శనపతి కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. సూర్యనారయణ ఇంటి తిరిగి ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇంతలో కోనేరులో అతను విగితా జీవిగా కనిపించాడు. దీంతో కుంటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతదేహంపై పడి జ్యోతి రోదించిడం చూసిఅక్కడ ఉన్నవారిని కలిచివేసింది.