రాజీవ్‌ హంతకుల విడుదలపై తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయం

rajiv gandhi

రాజీవ్‌ హంతకుల విడుదలపై తమిళనాడు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని రాజీవ్ హంతకులను విడుదల చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ హత్య అనంతరం 27 ఏళ్లుగా హంతకులు జైల్లోనే ఉన్నారు. గతంలో రాజీవ్ హంతకుల విడుదల అంశంపై
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సహా కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. దీంతో మరోసారి గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలు పంపింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -