అధికార పార్టీకి రెబల్స్ టెన్షన్‌..ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ..

తెలంగాణలో అధికార పార్టీకి రెబల్స్‌ దడ పట్టుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. ఉప్పల్, ఎల్‌బి నగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, పరిగి, మహేశ్వరంలో రెబల్స్ బెడద ఎక్కువుంది. టికెట్ రాకుంటే రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎల్‌బి నగర్‌ టికెట్ రామ్మోహన్‌ గౌడ్‌కు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వజీర్‌ ప్రకాశ్‌ గౌడ్‌.. కార్యకర్తలతో రహస్య సమావేశం పెట్టారు. ఉప్పల్‌ టికెట్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అటు.. చేవెళ్లలో కేఎస్‌ రత్నం.. ఇబ్రహీంపట్నంలో కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. మహేశ్వరంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని కొత్త మనోహర్‌ రెడ్డి ప్రకటించారు.