తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌లోనే ఎన్నికలు!

తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి.. అక్టోబరు రెండో వారంలో, 10వ తేదీ తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది.. అప్పటి నుంచి 45 రోజులు అంటే నవంబరు చివరి వారంలో పోలింగ్‌ జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలను వేగవంతం చేసింది. నాలుగు రోజుల్లోనే ఓటింగ్‌ యంత్రాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కూడా ఈసీ కుదించింది. ఈనెల పదో తేదీనే ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది.