విమానంలో పరిమితికి మించి ప్రయాణీకులు.. కుప్పకూలి 21 మంది..

ఉన్న బస్సులు చాలక వచ్చిన బస్సుని వదల్లేక ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుంటారు నగర యువత. ఈ ప్రయాణం ఒక్కోసారి ప్రాణాలు తీస్తుంది. బస్సుల్లోనే అనుకుంటే విమానాల్లో కూడా ఎక్కించున్నారు ఎక్కువ మందిని.. గాల్లో ప్రయాణిస్తుంటేనే అలవాటు లేని వారికి సగం ప్రాణం పోయినట్టే ఉంటుంది.

అలాంటిది పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకుని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సరస్సులో కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దక్షిణ సుడాన్ జుబా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి యిరోల్ సిటీకి బయలు దేరిన విమానంలో 19మంది ప్రయాణీకులకు అనుమతి ఉండగా మరికొంత మందిని ఎక్కించుకుని ప్రమాదానికి కారణమయ్యారు.

తీవ్రంగా గాయపడిన వారిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.