కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతోన్న అలెస్టర్ కుక్ సెంచరీల మోత

alastair cook

ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ భారీస్కోర్ సాధించింది. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతోన్న అలెస్టర్ కుక్ , జో రూట్ సెంచరీలతో చెలరేగిన వేళ ఆ జట్టు భారత్ ముందు 464 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. నాలుగోరోజు తొలి సెషన్ నుంచీ భారత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన వీరిద్దరూ మూడో వికెట్‌కు 259 పరుగులు జోడించారు. కుక్ 147, రూట్ 125 పరుగులకు ఔటయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 423 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హనుమ విహారి 3, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. భారత బ్యాట్స్‌మెన్ పట్టుదలగా పోరాడితే మ్యాచ్‌ను డ్రాగా ముగించే అవకాశాలున్నాయి.