జర్నలిస్టులకు ఏపీ సీఎం శుభవార్త.. వంద కోట్లు..

ప్రజలకు, ప్రజా ప్రతినిధులు మీడియేటర్ మీడియా. వారికి సొంత ఇళ్లను ఏర్పాటు చేయాలన్న తలంపుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణం అంశాన్ని అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. దీని కోసం వంద కోట్లు కేటాయించామని, ఏపీ రాజధాని, గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కట్టని విధంగా ఇక్కడ ఇళ్లు నిర్మిస్తామని, వీటి విలువ రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. ఇల్లు కట్టడం.. పెళ్లి చేయడం రెండూ కష్టంతో కూడుకున్నవే అని చెబుతూ ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా ఉత్తమమైన నాణ్య ప్రమాణాలతో ఇళ్లు కట్టిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.