పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రజలకు ఊరట

cause-of-petrol-rates-hike

వాహనదారులకు ఏపీ సర్కార్‌ ఊరటనిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై 2 రూపాయల మేర మేర వ్యాట్ తగ్గించింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. వ్యాట్ తగ్గింపుతో రాష్ట్రానికి 11 వందల 20 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుంది. ఐతే.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు సీఎం చంద్రబాబు. పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు భారంగా మారిందన్న సీఎం.. ఇంధన ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు.

అయితే పెట్రలో ధరలు మాత్రం యథావిధిగా పెరుగుతూ పోతున్నాయి. బంద్‌ రోజున కూడా పెట్రోల్‌, డీజీల్‌ ధరల పెంపు కొనసాగింది. తాజా పెంపుతో పెట్రోల్‌ ధర ముంబయిలో రూ.90కి చేరువలోకి వచ్చింది. దేశరాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.73, డీజిల్‌ రూ.72.83గా ఉంది. ఇక అత్యధికంగా ధరలు ఉండే ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.88.12కి చేరగా.. డీజిల్‌ ధర రూ.77.32గా ఉంది. ఇక హైదరాబాద్‌లో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.60, డీజిల్‌ ధర రూ. 79.22గా ఉంది.