విష్ణుకుమార్ రాజుకు చంద్రబాబు సవాల్

మాటలు చెప్పడం సులువుని, కానీ ఆచరించడం చాలా కష్టమని చంద్రబాబు చెప్పారు. కేంద్రం 2022 నాటికి అందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిందని, ఆచరణలో మాత్రం విఫలమైందన్నారు. గత ప్రభుత్వం 14 లక్షల ఇళ్లు కట్టామని చెప్పి, 4 వేల కోట్ల అవినీతికి పాల్పండిందని ఆరోపించారు. తన ప్రభుత్వం అందరికీ ఇళ్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం కేవలం 20 వేల 500 మాత్రమే సబ్సిడీ ఇస్తే, టీడీపీ సర్కారు లక్షా 50 వేల రూపాయలు ఇస్తోందని గుర్తు చేశారు. అన్ని వసతులతో ఇళ్లు కట్టిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఇంత అద్భుతమైన ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సవాల్‌ విసిరారు.

ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరక్కుండా 4 స్టేజీల్లో జియో ట్యాగింగ్ చేశామని చంద్రబాబు చెప్పారు. ఆధార్‌ సీడింగ్‌తో, లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నామన్నారు. హౌసింగ్ వెబ్‌ సైట్‌లో లబ్ధిదారుల జాబితా పెట్టామని చంద్రబాబు తెలిపారు.