కేసులున్న జగన్‌ను కాపాడుతోంది ఆయనే.. : చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. వైసీపీతో సంబంధాలు లేవన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ఆయన మండిపడ్డారు. రెండు పార్టీల మధ్య సంబంధాలున్నాయని నొక్కి చెప్పారు. కేసులున్న జగన్ ను కాపాడుతోంది కేంద్రమేనన్నారు. జగన్ కేసులు నీరుగార్చడాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తారా అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు చంద్రబాబు సవాలు విసిరారు. రాష్ట్రం మీద ఆపరేషన్‌ గరుడ ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీకి, వైసీపీ ఉన్న ముసుగు ప్రధాని మోడీయేనన్నారు.