బాల్కనీలో వేలాడుతున్న పాప..

చాలా మంది చేసే పనే ఇది. చిన్నారులు నిద్రపోతున్నారు కదా అని తలుపు దగ్గరగా వేస్తారు. లేదంటే తాళం పెట్టి ఎంతలోకి వెళ్లి వస్తాం అని ఏదో ఒక పనిమీద బయటకు వెళుతుంటారు. ఈ లోపే నిద్రలో ఉన్న చిన్నారులు చుట్టూ చూసి బాల్కనీలోకి వస్తుంటారు. ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. సరిగ్గా ఇలానే జరిగింది చైనాలోని జియాంగ్సూ రాష్ట్రం చాంగ్‌షూ ఊరిలో. పాప నిద్ర పోతుంది కదా అని తండ్రి తాళం వేసి బయటకు వెళ్లాడు పనిమీద. నిద్ర లేచిన పాప నిద్ర మత్తు కళ్లతోనే బాల్కనీలోకి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు వంగి చూసింది.

దాంతో జారి పడబోయింది. అదృష్టం బావుండి బాల్కనీ ఫెన్సింగ్‌కి చిక్కుకుపోయింది. గమనించిన కొరియర్ డెలివరీ బాయ్‌లు ఇద్దరు వెంటనే పాపను కాపాడే నిమిత్తంగా పాక్కుంటూ పలు అంతస్థులు పైకి వెళ్లారు. పాప ఉన్న దగ్గరకు చేరుకుని చిన్నారి కాపాడారు. తండ్రి వచ్చే లోగా ఈ ఘటన మొత్తం జరిగిపోయింది. అప్పుడు గానీ తీరిగ్గా తండ్రి వచ్చాడు. జరిగిన సంఘటన తెలుసుకుని పాపను కాపాడిన కొరియర్ బాయ్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసాడు. మరింకెప్పుడు ఇలా చేయను తల్లీ అటూ పాపను ఎత్తుకుని మాద్దాడాడు.