షాకింగ్.. మిస్సైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వైస్‌ ప్రెసిడెంట్ దారుణ హత్య

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వైస్‌ ప్రెసిడెంట్ కిరణ్ సంఘ్వి దారుణ హత్యకు గురయ్యాడు. గత బుధవారం నుంచి ఆయన కనిపించకుండాపోగా.. పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరకు మృతదేహన్ని గుర్తించారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సర్ఫరాజ్‌ షైక్‌ను ఆదివారమే అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. సంఘ్వీని హత్య చేసి మృతదేహాన్ని కల్యాణ్‌ హైవే దగ్గరలో పడవేసినట్లు తెలిపాడు.

సంఘ్వీ ఈ నెల 5 నుంచి కనిపించకుండాపోయినట్లు ఎన్‌ఎమ్‌ జోషి మార్గ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు ఉదయం రక్తపు మరకలు ఉన్న అతని కారును గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితునితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ హత్య కేవలం వృత్తిపరమైన అసూయతోనే జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంఘ్వీ వృత్తిలో అంచెలంచెలుగా ఎదగడం, ఇతరులతో సరదాగా ఉండటం వంటి విషయాలు కొందరు సహోద్యుగులలో అసూయ నింపింది. 2007లో హెచ్‌డీఎఫ్‌సీలో సీనియర్‌ మేనేజర్‌గా చేరిన సంఘ్వీ 2011లో అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. 2015లో డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియామకం పొందారు. 2017 జనవరిలో వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి సాధించారు. ఉద్యోగంలో చేరిన పది సంవత్సరాలలో మూడు సార్లు పదోన్నతి పొందడంతో కొందరు సహోద్యుగులలో వృత్తిపరమైన అసూయ నెలకొంది. ఆ అసూయే సంఘ్వీ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -