గచ్చీబౌలిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురు మృతి

చాలా ప్రమాదాలకి కారణం అతి వేగం. సామాన్యులే కాదు ఆర్టీసీ కూడా అందుకు మినహాయింపు కాదు. వారి మానాన వారు రోడ్డు పక్కనుంచి వెళుతుంటే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురి ప్రాణాలను పొట్టన బెట్టుకుంది. బస్సు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెచ్‌సీయూకి చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వేగంగా బస్సుని నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీన పరుచుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.