రికార్డు కనిష్టానికి పడిపోయిన రూపాయి.. భారీ నష్టాలతో..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దేశీయంగా కూడా సానుకూల సంకేతాలు ఏవీ లేకపోవడంతో, గ్లోబల్ అంశాలే మన మార్కెట్ల కదలికలను నిర్ణయించాయి.

డాలర్ బలపడడం, క్రూడాయిల్ ధర పెరగడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం… మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచి మన మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా డాలరుతో రూపాయి మారకం రికార్డు కనిష్టానికి పడిపోవడమే కాకుండా.. ఒక్క రోజులోనే దాదాపు 100 పైసలు విలువ కోల్పోవడం దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది.

ఇవాల్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్ 467.65 పాయింట్ల నష్టంతో 37922 వద్ద నిలవగా… ఎన్‌ఎస్ఈ సూచీ నిఫ్టీ 151 పాయింట్లను కోల్పోయి 11,438 వద్ద ముగిసింది. 275 పాయింట్ల మేర క్షీణించిన బ్యాంక్ నిఫ్టీ 27,206 వద్ద క్లోజయింది.