చుట్టూ పులులు.. మధ్యలో లేడీ.. చివరకు ఆమె చేతిలో పులి.. వీడియో

చీకట్లో ఇంటి పెరట్లోకి వెళ్లాలంటేనే భయం. అమ్మా నాన్న తోడు లేకపోతే అరడుగు కూడా ముందుకు వేయలేరు. అవన్నీ ఒకప్పటి రోజులు. ఈ రోజుల్లో మహిళలు అంతరిక్షంలోకీ వెళ్లగలరు… అడవికీ వెళ్లగలరు ఒంటరిగా. మగవారి ధీటుగా ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తుంది. ఔరా.. అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అడవిలో అన్నీ క్రూరమృగాలు.. అందునా అక్కడ పులులు మాత్రమే ఉన్న టైగర్ సఫారీ.

అక్కడికి ధైర్యంగా బండేసుకుని వెళ్లింది పులిలాంటి ఓ లేడీ. మొజాంబిక్ క్రుగర్ నేషనల్ పార్క్‌లోకి జంతు ప్రేమికురాలు పులుల కదలికపై పరిశోధనలు చేసే నిమిత్తం పులుల మధ్యకు వెళ్లింది. ఆమె ధైర్యానికి గాండ్రించే పులి సైతం అరవడం మరిచిపోయింది అడుగులు వెనక్కి వేసింది. తనమీదకు దూకబోయినా ఏమాత్రం భయపడకుండా వాటినే వారించింది.

అవి తోక ముడవక తప్పని పరిస్థితి. వాటితో చనువుగా ఉంటూ వాటి కదలికలను గమనిస్తూ మనుషుల్లానే వాటిక్కూడా భయం అనేది ఉంటుందని తేల్చింది. చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకపోయినా గుండె ధైర్యంతో పులిని ఎదిరించొచ్చు అని నిరూపించింది. మచ్చిక చేసుకుంటే అవి కూడా మాట వింటాయని తెలియజేసింది. వాటితో కబుర్లు చెప్పింది. ఆమె చెప్పే కథలు వింటూ తాము పులులమన్న విషయాన్ని కూడా మరిచిపోయాయి.

ప్రేమగా దగ్గరకు తీస్తే క్రూరమృగాలు సైతం ఏమీ చేయవని, ఆత్మ రక్షణ కోసం, ఆహారం కోసం మాత్రమే తమ బలాన్ని ప్రదర్శిస్తాయని తెలియజేసింది. అవకాశాన్ని బట్టి పిల్లి కూడా పులిలా మారడమే కాదు.. కొన్ని సందర్భాల్లో పులులు సైతం పిల్లుల్లా మారతాయని రుజువు చేసింది.