కడపలో కొనసాగుతున్న బంద్

today-ap-bandh-updates

కడప జిల్లాలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. తెల్లవారుజామునే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.. కడప ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర బైఠాయించారు. డిపోలోంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. పోలీసులు పలువర్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.